Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
షఉటింగ్ బాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే ఉద్యోగ,ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలంగాణ షఉటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అండర్-25 పురుషులు, మహిళల విభాగంలో షఉటింగ్ బాల్ రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించారు. క్రీడాకారుల ఎంపికలను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొననున్నారు. షఉటింగ్ బాల్ క్రీడల ఎంపికల్లో సుమారు 29 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొనగా ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... 1976 నుంచి ఇప్పటివరకూ ఈ క్రీడను జాతీయ స్థాయిలో 39 సార్లు నిర్వహించారని, వాలీబాల్‌ను పోలిన ఈ షఉటింగ్ బాల్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ లభిస్తుందన్నారు. వ్యాయామ విద్యలో షఉటింగ్బాల్ను భాగం చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. జిల్లాల వారీగా ఈ క్రీడ పట్ల ఆసక్తి, నైపుణ్యం ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇప్పించి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర షఉటింగ్ బాల్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి చెడుపాక ఐలయ్య, క్రీడా ప్రోత్సాహకులు యాదయ్య, యాకయ్య పాల్గొన్నారు.