Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
శ్రీ బుగులోని వెంకటేశ్వరస్వామి తిరుమలగిరి 2021జాతర సందర్భంగా జాతరలో వివిధ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం గుట్టల సమీపంలో జాతరలో కరెంటు విద్యుత్తు పనులు, లైటింగ్ పనులు, రోడ్లవెంబడి మొరం పోసి బ్లేడ్ బండితో చదును చేయించారు. రోడ్డుకిరువైపులా శుభ్రం చేయడం, సందర్శకుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయటం తదితర పనులను జాతర ఈవో బిల్ల శ్రీనివాస్ చైర్మెన్ కడారి జనార్ధన్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. నీటి సదుపాయానికి మారుతి ఇంజినీరింగ్ కంపెనీ వారు ముడతనపల్లి చేరాలు మోటారు బహూకరించిఆరు. సర్పంచ్ కట్ల రాణి మధుసూదన్ రెడ్డి, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రవణ్ పాల్గొన్నారు.