Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘణపురం
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని బండ్లగూడెం కేజీబీవీ బాలికల పాఠశాలను ఆదివారం సెక్టోరియల్ అధికారి పూనెం సంయుక్తరాణి సందర్శించి మౌలిక సదుపాయాలు, వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. నెహ్రు ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ప్రతీ విద్యార్థి కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈకార్యక్రమంలో స్పెషల్ అధికారి అన్నపూర్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు