Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక నిధులు కేటాయిస్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం మండలం పరిధి గోవర్ధనగిరి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో భూమి పూజ, మహా యజ్ఞం, కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. త్వరలో ఆలయ అభివద్ధికి నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ముసిపట్ల విజరు దంపతులు మహా అన్నదానం నిర్వహిం చారు. సర్పంచ్ శంకరి అనిత శ్రీనివాస్, కోమళ్ళ సర్పంచ్ మంజుల మధుసూధన్, వెళ్ది సర్పంచ్ కొయ్యడ మల్లేష్ ,అష్వరావుపల్లి సర్పంచ్ సురేందర్ రెడ్డి, నియోజకవర్గ మహిళ ఇన్చార్జి మడ్లపల్లి సునీత, పీఏసీఎస్ డైరెక్టర్లు సింగిరెడ్డి శ్రీనివాస్, దుర్గాప్రసాద్, దేవస్థాన కమిటీ చైర్మన్ కండ్లకొల్ల నాగభూషణం ,గ్రామశాఖ అధ్యక్షుడు తోటకురి సదానందం, మండల నాయకులు కుమార స్వామి, ఎంపీటీసీలు నాగరాజు, బిక్షపతి నాయక్, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి వెంకటేష్‌యాదవ్, మండల అధికార ప్రతినిది కొర్రా రాజేందర్ నాయక్ పాల్గొన్నారు.
మేజర్ గ్రామపంచాయితీ అభివృద్ధి అమోఘం
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
మేజర్ గ్రామపంచాయితీ అభివృద్ధి పనులు ఆమో ఘంగా సాగుతున్నాయని, త్వరలోనే మున్సిపాలిటీ గా మారబోతున్నదని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు, ఎమ్మెల్యే సోదరుడు తాటికొండ సురేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకులు అక్కనపల్లి బాలరాజు, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, మునిగెల రాజు, గుర్రం రాజు, మండల మహిళ అధ్యక్షురాలు స్వాతిశ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మునిగెల రాజు , డాక్టర్ లక్కాకూల జగన్ , కొంగరి కుమార్ పాల్గొన్నారు.