Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
అ పార్టీ లో గోవర్ధనగిరి గ్రామ యువకులు చేరిక
నవతెలంగాణ-రఘునాథపల్లి
కమ్యూనిజమే దేశానికి ప్రత్యామ్నాయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని 30 మంది యువకులు పార్టీలో చేరారు. పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డి పాల్గొని వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమ్యూనిజం తోనే సమాజంలోని అంతరాలు తొలగిపోతాయని అన్నారు. నూటికి 90శాతం ఉన్న పేదలు పేదలుగా మిగిలిపోతున్నారన్నారు. గోవర్ధనగిరి గ్రామంలో యువకులు పార్టీలో చేరడం గొప్ప పరిణామమని అన్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి నేటి వరకు సీపీఐ(ఎం) ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నదన్నారు. గోవర్ధనగిరి గ్రామంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి వెంకట్రాజం, జిల్లా కమిటీ సభ్యులు పొదల నాగరాజు ఘన్పూర్ ఏరియా కార్యదర్శి మునిగెల రమేష్, మండల కార్యదర్శి గంగాపురం మహేందర్, మండల నాయకులు యాదగిరి, ఐలయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి శివ, గ్రామ సీనియర్ నాయకులు గోనయ్య, మల్లయ్య, శ్రీనివాస్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.