Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల హామీలను నెరవేర్చాలి
రైతు సమస్యల సాధన కోసం
పోరాటాలకు సిద్ధం
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు
గండ్ర సత్యనారాయణ రావు
నవతెలంగాణ-శాయంపేట
రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేసి పార్లమెంటును స్తంభింపజేసి రైతు సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలులో విఫలమయినట్టు విమర్శించారు. సీఎం కేసీఆర్ లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని, మిషన్ కాకతీయతో చెరువుల అభివద్ధి చేశామని చెబుతున్నారన్నారు. మరీ ఆయన రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయటం లేదని ప్రశ్నించారు. 4లక్షల కోట్లు అప్పులు తెచ్చామని చెబుతున్నారనీ, ఆ డబ్బులతో ధాన్యం కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటలపై ఆంక్షలు విధించకుండా రైతులు వారికి నచ్చిన పంట సాగు చేసుకునే విధంగా చూడాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను అయోమయంలో పడే ప్రకటనలు చేయోద్దన్నారు. రైతు సమస్యల సాధన కోసం ప్రత్యక్ష పోరాటా లకైన తాము సిద్ధమేనన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని పేర్కొన్నారు.
పార్టీ కార్యాలయం ప్రారంభం
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూదిపాల బుచ్చిరెడ్డి, చిందం రవి, చింతల రవిపాల్, మారపెల్లి రవీందర్, రమేష్, కుమారస్వామి, మార్కండేయ తదితరులు పాల్గొన్నారు.