Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా.
'స్వాతంత్య్రం అనంతరం నవభారతానికి పునాదులు వేసిన మహానీయుడు జవహర్లాల్ నెహ్రూ' అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆదివారం హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, వర్ధన్నపేట నియోజవకర్గ కో-ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. నెహ్రు ప్రవేశ పెట్టిన పంచవర్ష ప్రణాళికలతో భారత దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా అభివద్ధి చెందిందన్నారు. నెహ్రూ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి కట్టుగా కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిన్నీ లక్ష్మణ్, జిల్లా ఎస్సీ డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల బొంత సారంగం, గుంటి స్వప్న, హన్మకొండ మండలం ఎస్సీ డిపార్టుమెంటు అధ్యక్షురాలు తాళ్ళపల్లి మేరీ, డివిజన్ అధ్యక్షుడు నల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నెక్కొండ
స్థానిక నెహ్రూ సెంటర్లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రు జయంతిని ఆదివారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు బక్కిఅశోక్ , పట్టణాధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్, ఉపాధ్యక్షులు రాచకొండ రఘు , మండల, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రావుల మహిపాల్ రెడ్డి, సింగం ప్రశాంత్ పాల్గొన్నారు.
నవతెలంగాణ-చెన్నారావుపేట
స్వతంత్ర భారతానికి ప్రజాస్వామ్య ఊపిరిలూదిన మహనీయుడు, దేశానికి దశ - దిశ చూపిన దార్శనికుడు జవహర్ లాల్ నెహ్రూ అని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భూక్యగోపాల్నాయక్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నెహ్రు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్ల పెళ్లి నరసయ్య, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మొగిలి వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మంచాల సదయ్య, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి మంద యాకయ్య, మండల ఉపాధ్యక్షుడు నన్నే బోయిన రమేష్, సర్పంచ్ రమేష్ పాల్గొన్నారు.
నవతెలంగాణ - ములుగు
మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నల్లెళ్ళ కుమారస్వామి తెలిపారు. ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నెహ్రుజయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతూ రవి చందర్, పీఏసీఎస్ చైర్మన్ బొక్క సతిరెడ్డి, మండలాధ్యక్షులు ఎండీ చంద్ పాషా, టౌన్ ప్రెసిడెంట్ వంగ రవి