Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్ శశాంక
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లా కేంద్రంలోని తొర్రూరు రోడ్డులో చేపట్టిన మెడికల్ కళాశాల భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాల స్థలంలో అనుబంధంగా నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల భవన పనులను సోమవారం ఆయస సందర్శించి పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రూ.40 కోట్లతో సుమారు లక్ష చదరపు అడుగుల పరిధిలో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల పనుల ప్రగతి విషయమై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాత్రింబవళ్లు పనులు చేపట్టాలని సూచించారు. షెల్టర్లు నిర్మించడంతోపాటు మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని, భద్రత పెంచాలని, అపరిచితులను అనుమతించొద్దని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తానేశ్వర్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ భూక్యా వెంకట్రాములు, సర్వేయర్ విజరుభాస్కర్, రెవెన్యూ ఉద్యోగులు నరేష్, వినరు, తదితరులున్నారు.