Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
పోడు భూముల కాస్తులో ఉన్న పేద రైతు లందరికీ ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఇవ్వాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. అనంతరం వెంకట్రెడ్డి మాట్లాడారు. మండలంలోని కత్తి గూడెం రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 123, 124, 128 పోడు భూమిలో అక్కడి సుమారు వంద మందికిపైగా రైతులు 40 ఏండ్లుగా కాస్తు లో ఉన్నారని, వారికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలివ్వాల న్నారు. పోడు కాస్తులో ఉన్నవి ప్రభుత్వ భూమ ులేనంటూ 2017లో నాటి సబ్ కలెక్టర్ సర్వేలో నివేదించారని తెలిపారు. కబ్జాలో ఉన్న రైతులకు సదరు భూములను సర్వే చేసి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ లను విస్మరించిందని విమర్శించారు. కార్యక్ర మంలో పార్టీ మండల కార్యదర్శి ముత్యాలు, నాయకులు శివప్రసాద్, జాగటి చిన్న, నగేష్, ఎర్రయ్య, భవానీ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.