Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపూర్
మండలంలోని రామప్ప ఆలయంలోని శిల్ప కళ అద్భుతంగా ఉందని ఐజీ నవీన్‌చంద్ అన్నారు. ఆలయాన్ని సోమవారం ఆయన కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆయనకు అర్చకులు హరీష్ శర్మ, ఉమా శంకర్, ఆర్కే పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ మండపంలో శాలువాలతో సన్మానించారు. అనంతరం ఐజీ కుటుంబానికి టూరిజం అధికారి విజరు కుమార్ ఆలయ విశిష్టతను వివరించారు. ఐజీ వెంట ములుగు సీఐ గుంటి శ్రీధర్, ఏఎస్సై పురుషోత్తమ్, పోలీసులున్నారు.
ఉప్పల్ ఎమ్మెల్యే సందర్శన
రామప్ప ఆలయాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. అర్చకులు హరీష్ శర్మ, ఉమా శంకర్ వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ మండపంలో శాలువాలతో వారిని సన్మానించారు. అనంతరం టూరిజం విజరు కుమార్ ఆలయ విశిష్టతను వివరించారు.