Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొలిదశలో మూడిట్లో..
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మామునూరు విమానాశ్రయం నుంచి వచ్చే ఏడాదిలోనే విమానాలు ఎగిరే అవకాశముంది. ఈ మేరకు ఈ నెలాఖరులోపు తుది నివేదిక ఇవ్వాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని కేంద్రం కోరింది. రాష్ట్రంలో తొలి దశలో 3 విమానాశ్రయాల నుంచి విమానాలను నడపాలని కేంద్రం భావిస్తోంది. వరంగల్ జిల్లాలోని మామునూరు, నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి, పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్ విమానాశ్రయాల నుంచి విమానాలను నడపడానికి ఏర్పాట్లు చేయనున్నారు. ఒక్కో విమానాశ్రయానికి రూ.400-రూ.450 కోట్ల మేరకు ఖర్చయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేంద్రం 'ఉడాన్' పథకం కింద రాష్ట్రంలో 6 ప్రాంతీయ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని భావించింది. తొలిదశలో 3, తుది దశలో మరో 3 విమానాశ్రయాలను అభివృద్ధి చేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు తొలి దశలోని మామునూరు విమానాశ్రయంలో రన్‌వే ఏయిర్స్ట్రిప్స్ ఉన్నాయి. వినియోగంలో లేకపోవడం వల్ల రన్‌వే ఏయిర్స్ట్రిప్స్ దెబ్బతిన్నాయి. కొంత మేరకు మరమ్మతు అవసరం. జక్రాన్‌పల్లిలో రన్‌వేను నిర్మించాల్సి ఉంది.
తుది దశలో 3 విమానాశ్రయాల్లో..
తుది దశలో 3 విమానాశ్రయాల్లో విమానాలను నడపాలని కేంద్రం భావిస్తోంది. రెండో దశలో ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గొల్లగూడెం-పేటచెరువు, మహబూబ్‌నగర్ జిల్లాలోని గుడిబండలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని భావించారు.