Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండలంలోని బాలాజీతండా గ్రామంలో కోవిడ్ వ్యాక్సినేషన్ 99 శాతం పూర్తి చేసిన సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో సోమవారం అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రత్నావత్ శంకర్, ఎంపీటీసీ బట్టు నాగరాజు, జిల్లా మలేరియా వైద్య అధికారి సుధీర్‌రెడ్డి మాట్లాడారు. పంచాయతీ పరిధిలో వెయ్యి 32 మంది జనాభా ఉండగా లు మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో 18 ఏండ్లు నిండిన జనం 721 మంది ఉండగా 714 మందికి వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు. వైద్య, పంచాయతీ అధికారుల కషి అభినందనీయమని చెప్పారు. అనంతరం వైద్య సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్రావు, వైద్య అధికారులు సాంబశివరావు, రాధాకృష్ణ, బుజ్జమ్మ, పంచాయతీ కార్యదర్శి కిరణ్, ఏఎన్ఎంలు మాధవి, కవిత, ఆశ వర్కర్లు రమణ, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.