Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
ఆదివాసీల ఆరాధ్యుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా మండలం లోని బ్రాహ్మణపల్లి ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ హైస్కూల్లో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో మంగపేట, పినపాక మండలాల క్రీడాకారులకు క్రీడాపోటీలు నిర్వహించగా ఏటూర్‌నాగారం సీఐ కిరణ్ కుమార్ ప్రారం భించారు. తొలుత బిర్సాముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పిం చారు. అనంతరం సీఐ మాట్లాడారు. క్రీడలు మనో వికాసంతోపాటు దేహ దారుఢ్యాన్ని అందిస్తాయని తెలిపారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచు కుని రాణించాలని సూచించారు. కార్యక్రమంలో వనవాసీ కళ్యాణ పరిషత్ రాష్ట్ర క్రీడా ఇన్‌ఛార్జి కొమరం రఘుపతి, ఇప్పలపల్లి రమేష్, బ్రాహ్మణపల్లి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు జవహర్ లాల్, ఉపాధ్యాయులు గొప్ప సమ్మారావు, రేగా పాపయ్య, మంకిడి క్రిష్ణ, బండారి జగదీష్ , మట్టె సతీష్, చౌలం సాయిబాబు, కల్తీ అశోక్ బాబు పాల్గొన్నారు.