Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి
పబ్లిక్ టాయిలెట్ పనుల పరిశీలన
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని మల్లూరు గ్రామపంచాయతీలో ఈజీఎస్ నుంచి రూ.2.10 లక్షలు, గ్రామపంచాయతీ నుంచి రూ.90 వేలు వ్యయంతో చేపట్టిన పబ్లిక్ లియిలెట్ పనులను మేడారం జాతర నాటికి పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం అధికారులను ఆదేశించారు. టాయిలెట్ నిర్మాణాలను ఆమె సోమవారం సందర్శించి పరిశీలించారు. అంచనా మించితే పంచాయతీ నిధుల నుంచి మంజూరు చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, ఎంపీడీఓ కర్నాటి శ్రీధర్, ఎంపీఓ శ్రీకాంత్ బెహరా, ఈజీఎం ఏపీఓ భవానీ, పంచాయతీ కార్యదర్శి ఎల్లస్వామి, వీఆర్వో శ్రీకాంత్, తదితరులున్నారు.