Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హక్కు పత్రాలివ్వాలి : సేవాలాల్ సేన
నవతెలంగాణ-బయ్యారం
మండలంలో సాగులో ఉన్న పోడు భూములన్నిటికీ హక్కు పత్రాలివ్వాలని సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య రవి నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని బోటితండాలో భూక్య రాజేందర్ నాయక్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంంలో రవినాయక్ మాట్లాడారు. జీఓ నెంబర్ 3కు చట్టబద్దత కల్పించి ఏజెన్సీలోని 29 శాఖల్లో నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే కల్పించాలని, గిరిజనులపై అటవీ శాఖ అధికారులు బనాయించిన తప్పుడు కేసులను కొట్టివేయాలని, 1/70 చట్టానికి భిన్నంగా గిరిజనేతరులకు ఏజెన్సీలలో హక్కు పత్రాలివ్వొద్దని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వీరన్న, చందు నాయక్, నరేష్, బావుసింగ్, కస్నా, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.