Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రీయ కాషాయ దళ్ గౌరవ అధ్యక్షుడు పాండు
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని రాష్ట్రీయ కాషాయ దళ్ గౌరవ అధ్యక్షుడు, బేడ బుడగ జంగాల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ తూర్పాటి పాండు కోరారు. కంఠాయపాలెం రోడ్డులోని వెంకటేశ్వర ఫంక్షన్ హాలులో సోమవారం నిర్వహించిన సమావేశానికి పాండు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్రీయ కాషాయ దళ వ్యవస్థాపక అధ్యక్షుడు కిన్నెర ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, సినీ నటుడు కిన్నెర యాదగిరి, గోశాల ఉపాధ్యక్షుడు కేవ్ సింగ్, నాయకులు సిరిపాటి విశాల్, వస్తం లక్ష్మణ్, కొండపల్లి శ్రీనివాస్, కళ్యాణి ఉప్పలయ్య, పత్తి వెంకన్న, రెబెలి సాంబశివ, సిరిగిరి శ్రీనివాస్, కోటేష్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.