Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొనుగోలు కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-తొర్రూరు
రైతులు అధైర్యపడొద్దని పెద్దవంగర ఎంపీపీ ఈదురు రాజేశ్వరి కోరారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. మండలంలోని బావోజీ తండా, వడ్డే కొత్తపల్లి గ్రామాల్లో తొర్రూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సహకారంతో కొత్తగా ఆర్సీ తండా, బావోజీతండాల్లో సెంటర్లను మంజూరు చేయించినట్టు తెలిపారు. మండలంలో మొత్తం 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర లభిస్తుందని తెలిపారు. 'ఏ' గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.1960లు, 'బీ' గ్రేడ్ ధాన్యానికి రూ.1940లుగా నిర్ణయించినట్టు వివరించారు. రైతులు ధాన్యాన్ని తూర్పార పట్టి 17 శాతానికి మించని తేమతో తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ పాకనాటి సోమారెడ్డి, సర్పంచ్‌లు నెమరుగోమ్ముల ప్రవీణ్‌రావు, బానోత్ జమున గోపాల్, ఎంపీటీసీ సభ్యులు సాయిని ఝాన్సీ రవి, ఏఈఓలు మానస, లక్ష్మీ, ప్రవళిక, ఉపసర్పంచ్లు జాటోత్ భాస్కర్, శీను, మండల పార్టీ కార్యవర్గ సభ్యులు బొల్లు ఉషాలు, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వల్లెపు కుమార్, బానోత్ శ్రీనివాస్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి పరమేష్, బానోత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.