Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
సైన్స్‌ను ఉద్యమంలా ప్రజల చెంతకు విస్కృతం చేసి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని జేవీవీ రాష్ట్ర నాయకుడు, నిట్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని పాత్‌ఫైండర్ పాఠశాలలో జేవీవీ వరంగల్ జిల్లా తృతీయ మహా సభలు పీ.సదాశివుడు ప్రాంగణంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ వీఎం జయుడు అధ్యక్షతన నిర్వ హించారు. ఈ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని మూఢ నమ్మకా లను తొలగించడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా జేవీవీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. 33యేండ్లగా జేవీవీ సమాజహితం కోసం, సైన్స్ పరిశోధనా ఫలాలను సామాన్యుడి చెంతకు తీసుకొళ్లడం కోసం పాటుపడుతోందన్నారు.
విద్య, వైద్యం ప్రజలందరికి అందుబాట్లోకి తీసుకరావాల్సిన అవసరం పాలకులపై ఉందన్నారు. ఈ రెండు రంగాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడే అది సాధ్యపడు తుందన్నారు. కోవిడ్ వంటి పాండమిక్ పరిణామాలను చేధించడానికి, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి జేవీవీ చైతన్య కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జీ.సుధాకర్, కే.వెంకన్న నేతృత్వంలో పలు రకాల సంస్కృతిక ప్రదర్శనలు చేశారు. ఈ మహాసభలో సౌహర్థ ప్రతినిధులు మహబూబాబాద్ జిల్లా జేవీవీ నాయకులు దయానంద్, బ్రహ్మ, జనగాం జిల్లా నుంచి వెంకటేష్ హాజరు అయ్యారు. మహా సభలో జేవీవీ నాయకులు కూచన భద్రయ్య, ప్రధాన కార్యదర్శి వీ.రాజు, పాత్‌ఫైండర్ ప్రిన్సిపాల్ బిక్షపతి, ఆర్.బిక్షపతి, ఎం.ఇంద్రసేనారెడ్డి, పీ.భాస్కర్, కుమార్‌రెడ్డి, సురేష్, దేవేందర్ రెడ్డి, ఎల్ఐసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యడ రామయ్య, యాకయ్య, ప్రవీణ్, రోహన్ పాలొన్నారు.