Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ-పరకాల
విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఉదయం 5గంటలకు పట్టణంలోని ప్రధాన రహదారి, పాత ఏటీఎం సెంటర్, బస్టాండ్, వెల్లంపల్లి రోడ్డు వెంట కాలినడకన తిరుగుతూ శానిటేషన్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్ శేషాంజన్స్వామికి పలు సూచనలు చేశారు. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేయాలని చెప్పారు. మిషన్ భగీరథ పైపులైన్ కోసం తవ్వకాలు జరిపిన సందర్భంలో దెబ్బతిన్న రోడ్లకు కాంట్రాక్టర్ మరమ్మతులు చేసేలా చూడాలని చెప్పారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మడికొండ శ్రీను, కౌన్సిలర్ మడికొండ సంపత్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు మార్క రఘుపతి, శనిగరపు నవీన్, మేరుగు శ్రీశైలం, జాఫర్‌రిజ్వీ తదితరులున్నారు.
బ్రిడ్జి నిర్మించాలని వినతి
పరకాల పట్టణంలోని చలివాగుపై రాకపోకలు సాగేలా నూతన బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మడికొండ సంపత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.