Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
రైతుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వ్యవసాయ మార్కెట్ వైస్ ఛైర్మన్ చల్లా చందర్ రెడ్డి, ఛాగల్ సర్పంచ్ పోగుల సారంగపాణి అన్నారు. సోమవారం మండలంలోని థానేదార్ పల్లిలో శ్రీవేంకటేశ్వర, ఛాగల్ లో నవోదయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ధాన్యం అమ్ముకోవడంలో దళారులను ఆశ్రయించకుండా, ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో తానేథార్పల్లి సర్పంచ్ గాదె చంద్రయ్య, ఎంపీటీసీ కనకం స్వరూపగణేష్, మాలోత్ లలిత శ్రీను, ఉపసర్పంచ్ ఎస్సి సెల్ నియోజకవర్గ ఇంఛార్జీ కనకం రమేష్, వార్డు సభ్యులు జయశీల, మండల అధ్యక్షులు మాచర్ల గణేష్, రైతు కో ఆర్డినేటర్లు మాదిరెడ్డి రాఘవరెడ్డి, దుంపల పద్మారెడ్డి, మాచర్ల ప్రవీణ్, నర్సయ్య, ఏఈఓ జగదీష్, ధర్మారెడ్డి, సీసీ రజిని, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.