Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ధర్మసాగర్
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గుర్రపు ప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక అమరవీరుల స్థూపం వద్ద జాతీయ పత్రిక దినోత్సవాన్ని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జర్నలిస్టులతో కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు వ్యయ, ప్రయాసాలకు ఓర్చి వార్తలు సేకరిస్తూ, ప్రజా సేవలో ముందు వరుసలో ఉన్నారని కొనియాడారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించడం లేదన్నారు. జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాటి స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జర్నలిస్టుల పాత్ర మహౌన్నతమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డు లెనిన్, దేవునూరు గ్రామ శాఖ అధ్యక్షులు కంకటి తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి యాకుబ్ పాషా, జిల్లా ఉపాధ్యక్షులు బైరి ఇంద్ర సేన, మాచర్ల రవిందర్, బొడ్డు ప్రేమ్ రాజ్, ప్రింట్ మీడియా కార్యదర్శి ఇసంపల్లి రమేష్, ఉపాధ్యక్షుడు గజ్జెల సుమన్, కార్యదర్శి పొలుమారి గోపాల్, కార్యవర్గ సభ్యులు గంగారపు విజరు, బత్తిని మహేష్, బొల్లెపాక రాజేష్, గంటే కిరణ్, నాగవెళ్లి దుర్గరాజు, ఉల్లెంగడపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
జాతీయ పత్రిక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పాత్రికేయులను కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బక్కి అశోక్, ఎస్ఎంసీ ఛైర్మన్ గందం రాజు, నాయకులు చెన్నకేశవులు, ప్రభాకర్, మైపాల్‌రెడ్డి, ప్రశాంత్, భానుప్రకాష్, రఘు, సాయిక్రిష్ణ, శ్రీనివాస్‌లు పాత్రికేయులను శాలువాలు, బహుమతులతో సత్కరించారు.