Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాశిబుగ్గ: నగరంలోని సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు జాతీయస్థాయిలో అత్యున్నత స్థాయి ప్రమాణాలు గల హాస్పిటల్ గా గుర్తింపు పొందినట్లు ఆ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ ఎన్ సామ్యూల్ తెలిపారు. మంగళవారం సంరక్ష లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన, డైరెక్టర్లతో కలిసి వివరాలను వెల్లడించారు. జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ సర్టిఫికెట్తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థలు తమ హాస్పిటల్ యొక్క వైద్య సదుపాయాలను ఉపయోగించుకుంచుకోవచ్చన్నారు. కార్యక్రమంలో వైద్యులు టీ భాస్కర్, ఎస్.రఘు, ఉషారాణి, పోలా నటరాజ్ పాల్గొన్నారు