Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్
నవతెలంగాణ-నర్సంపేట
ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ సీఎం కేసీఆర్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నాడని ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ విమర్శించారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని కాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్కు ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల చిత్తశుధ్ది లేదన్నారు. ధనిక రాష్ట్రమని చెబుతున్నా సీఎంకు కళాశాలలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయకపోవడం విడ్డూరమన్నారు. మధ్యాహ్న భోజనం జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తామన్న సీఎం హామీ నీటి మూటలుగానే మిగిలిపోయిందని మండిపడ్డారు. మాటలే తప్పా వాటిని ఆచరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని, లేకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు యార రాకేష్, మౌనిక, కీర్తన, సుప్రజా, రమ్య, శ్రీ వాణి, శ్రీనివాస్, రంజిత్, సాయి తదితరులు పాల్గొన్నారు.