Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నియోజకవర్గ ఇనచార్జి మోటం ప్రభాకర్
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
బేడ బుడిగ జంఘాలవారికి సముచిత స్థానం కల్పించాలని నియోజకవర్గ ఇన్చార్జి మోటం ప్రభాకర్, మహిళా నాయకులు కాసర్లపూడి లక్ష్మి అన్నారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర జేఏసీ వైస్ ఛైర్మన్, దళితరత్న చింతల యాదగిరికి రాజకీయ ప్రత్యక్షపాత్రలో పాల్గొనేందుకు వీలును కల్పిస్తూ, ఎమ్మెల్సీ అవకాశం కల్పించి, రాజకీయ సామాజిక న్యాయం చేయాలని కోరారు. 75 ఏండ్ల స్వాతంత్య్రం గడిచినా బేడబుడిగ జంగాలకు ఏ రాజకీయ పార్టీలు కూడా సముచిత స్థానం కల్పించి ఆదుకోలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తమవంతు పోరాటం చేశామని గుర్తుచేశారు. దళిత సామాజికవర్గంలో మాల, మాదిగల జనాభా దామాషా ప్రకారంగా మూడవ స్థానంలో బేడ బుడిగ జంగాలు ఉన్నారన్నారు. వారికి చట్టసభల్లో స్థానం కల్పించాలని, బేడ బుడిగ జంగాలకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కడమంచి యాదగిరి, యూత్ నాయకులు మోటం ప్రకాష్, బాలక్రిష్ణ, నరేష్, కడమంచి దాసు పస్తం జంగయ్య, హుస్సేన్, వంశీ, హరిబాబు, మనోహర్, బాబు, రాజు, తదితరులు పాల్గొన్నారు.