Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి నియోజ కవర్గంలో ఇప్పటివరకు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో పేద విద్యార్థులు విద్యను కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వెంటనే కళాశాలలు ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ధర్మభిక్షం కోరారు. మంగళ వారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ధర్మభిక్షం మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి, విద్య అభివృద్ధి పై పాలకులు దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్య, వైద్య సమస్యల్ని పరిష్కరిం చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భవనాలు లేని పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరవింద్, వేణు, తరుణ్, వెంకటేష్, కార్తీక్, ధనలక్ష్మి, మాధవి, కవిత, సుష్మ, పూజిత తదితరులు పాల్గొన్నారు.