Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం
నవతెలంగాణ-జనగామ
ఈనెల 20, 21 తేదీల్లో హైదరాబాదులో మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నారని, జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్ష కార్యద ర్శులు పంపర మల్లేశం మునిగెల రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని పెంబర్తి గ్రామంలో నిర్వహించిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. 20 ఏండ్లలో మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర తమ సంఘానికి ఉందన్నారు. ఉచిత చేప పిల్లల పథకం నిర్వీర్యం అయిపోతుందని, దళారులకు వరంగా మారిందన్నారు. జిల్లాలో సగం చెరువల్లో కూడా చేపపిల్లలు వదల్లేదన్నారు. సీడ్ రాని సొసైటీలకు నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు వడపల్లి రాజు, పాలు సంపత్, పూస వెంకట్, దండు కుమార్, అన్నెపు ప్రభాకర్, మిడిదొడ్డి రాజు, రాజు, కిషన్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.