Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ స్మారక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో భూ సంస్కరణలు అమలు చేయాలన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని, జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని అన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంద న్నారు. రైతుల పంటలకు మార్కెట్ సౌకర్యం కల్పించి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అర్హులైన వృద్ధులకు. వితంతువులకు పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించి పింఛను అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, చిట్యాల సోమన్న, ధర్మభిక్షం, అనిల్ చౌహాన, బొట్ల శ్రావణ్, పనికర రాజు, తరుణ్, తదితరులు పాల్గొన్నారు.