Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జయశంకర్-భూపాలపల్లి
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
ఆర్టీసీ, పోలిస్, రవాణాశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ప్యాసింజర్లతో నడిపే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జయశంకర్-భూపాలపాల జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాల యంలో నిర్వహించిన రవాణా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమా వేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో రహదారి భద్రత నియమాలు పాటించక పోవడంతో తరచూ రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటివి పున రావృతం కాకుండా భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్, కమలాపూర్ ఎక్స్ రోడ్, కాటారం, మహాదేవపూర్, చెల్పూర్, ఘన్పూర్ ఎక్స్‌రోడ్ తర ప్రాంతాలపై నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ప్రయాణికులను రవాణా చేసే ప్రైవేటు వాహ నాలపై జరిమానా విధించాలన్నారు. కేటాయించిన రూట్ల లో సమయానికి బస్సులు నడపాలని ఆదేశించారు. ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిం చాలన్నారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాస్కర్, డివిజనల్ మేనేజర్ శ్రీదేవి, భూపాలపల్లి డిపో మేనేజర్ ధరమ్ సింగ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎండీ సంధాని, స్పెషల్ బ్రాంచ్ పోలిస్ ఇన్స్పెక్టర్ వేణు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం బాలల సంరక్షణ అధికారులతో కలిసి చిల్డ్రన్స్ సే దోస్తీ పోస్టర్‌ను కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆవిష్కరించారు. బాలల సంరక్షణకు ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలు ప్రతిజ్ఞ పూనాలని పిలుపునిచ్చారు. జిల్లా సంక్షేమ అధికారి కె. సామ్యూల్, సిడబ్ల్యూసీ చైర్మన్ వేణుగోపాల్, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ శిరీష, డీసీపీఓ హరికృష్ణ పాల్గొన్నారు.