Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్ నాయక్
నవతెలంగాణ-రాయపర్తి
రేషన్ డీలర్ ఎనగందుల ఉపేందర్‌పై దాడికి పాల్పడిన లక్కం రాజును కఠినంగా శిక్షించాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు దారవత్ మోహన్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రేషన్ డీలర్లు మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎస్సై బండారి రాజుకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన ఘటన వివరాలను వెల్లడించారు. కొండాపురానికి చెందిన ఎనగందుల ఉపేందర్ స్వగ్రామంలో రేషన్ డీలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా మహబూబ్‌నగర్‌లోని రేషన్ షాపు నిర్వహణ భాద్యతలును కూడా తానే చూస్తున్నాడు. సోమవారం సాయంత్రం లక్కం రజిత అనే లబ్ధిదారురాలు బియ్యం కోసం షాపుకు వచ్చింది. ఈ క్రమంలో ఈ పాస్ మిషన్ ద్వారా పంపించినా ఓటీపీ ఆమె భర్త అయిన లక్కం రాజుకు వెళ్లింది. నెంబర్ చెప్పకపోగా కొద్ది సేపు ఆమె అక్కడే వేచి ఉంది. అనంతరం అక్కడికి వచ్చిన ఆమె భర్త లక్కం రాజు దుర్భాషలాడుతూ ఈపాస్, వేయింగ్ మిషిన్లను ధ్వంసం చేసి విచక్షణరహితంగా డీలర్ ఉపేందర్‌పై భౌతిక దాడి చేశారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసిన నానా హంగామా చేసి డీలర్‌ను భయబ్రాంతులకు గురిచేశారు. ప్రజాసేవ చేస్తున్న రేషన్ డీలర్లపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిందితుడు లక్కం రాజును కఠినంగా శిక్షించాలని కోరారు. రేషన్ డీలర్ పై దాడి గురించి జిల్లా కలెక్టర్ గోపీకి, ఆర్డీఓ మహేందర్ జీ దష్టికి తీసుకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగర రాణి రాజ్ కుమార్, వివిధ మండలాల అధ్యక్షులు గడ్డం బాబు, వెంకట నారాయణ, శంకర్ రావు, ప్రేమ్ రావు, మోహన్ రెడ్డి, పంచాక్షరీ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు