Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
బాలల రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యుడు డాక్టర్ సుధాకర్ అన్నారు. బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా మంగళవారం వరంగల్ రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైల్డ్ లైన్ సే దోస్తీ బ్యాండ్ అధికారులకు, షాప్ వెండర్, షాప్ కీపర్, ఆటోడ్రైవర్‌కి కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల అక్రమ రవాణాని అడ్డుకోవాల్సిన బాధ్యత స్టేషన్ పరిధిలో అన్ని శాఖల వారిపై ఉందన్నారు. ముఖ్యంగా వెండర్స్ ప్లాట్ఫారలోని పిల్లల్ని గమనిస్తూ ఉండాలని కోరారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఆర్పీఎఫ్, చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1098కి సమాచారం అందించాలన్నారు.
పిల్లల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కషి చేయాలని, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చైల్డ్ లైన్ టీంకి సహకరించాలని కోరారు. అనంతరం కాజీపేట ఆర్పీఎఫ్ ఎస్సై శ్రావణి మాట్లాడుతూ.. బాలల అక్రమ రవాణా నిరోధకానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ డెస్క్ కో-ఆర్డినేటర్ చింతకింది రాజు, టీటీఐ విశ్వనాధ్, ప్రియావాణి, జీఆర్పీ కానిస్టేబుల్ వేణుగోపాల్, చైల్డ్ లైన్ టీం సభ్యులు హరికష్ణ, వెంకటేష్, రాజు, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-ములుగు
ఈ బాలల రక్షణ ప్రజలందరిదని బాలరక్ష కో-ఆర్డినేటర్ కే స్వాతి అన్నారు. బాల్య వివాహాలు, కార్మికులు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. స్థానిక పంచాయతీ కేంద్రంలో వీసీపీసీ కో-కన్వీనర్, పంచాయతీ కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల నిర్మూళన ప్రజలందరి బాధ్యతన్నారు. చైల్డ్ లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ ప్రణరు మాట్లాడుతూ.. బాలలకు ఏ సమస్యలు వచ్చినా చైల్డ్ లైన్ 1098 కి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం ప్రొటెక్షన్ ఆఫీసర్ హరికష్ణ మాట్లాడుతూ.. దత్తతను సక్రమ పద్ధతిలో చేసుకోవాలన్నారు. దత్తత ప్రక్రియ కోసం తమ శాఖ (డీసీపీయూ)ను సంప్ర దించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు, సోషల్ వర్కర్ జ్యోతి, చైల్డ్ లైన్ సభ్యురాలు రమ్య, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.