Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాంబాబు
నవతెలంగాణ-రఘునాథపల్లి
టీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు శాశ్వతం కాదని, పార్టీ కోసం పని చేయాలని కష్టపడే కార్యకర్తలకు పార్టీ నిరంతరం గుర్తిస్తుందని, అందుకు నిదర్శనం మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అని జనగామ జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారుజోడు రాంబాబు అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం కడియంకు ఎమ్మెల్సీ అవకాశం వచ్చినందుకు మంగళవారం మండల కేంద్రంలోని మాజీ జడ్పీటీసీ మారుజోడు రాంబాబు ఇంటి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే అభివద్ధిలో ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. దళితుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఇందుకు నిదర్శనం మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దాసరి అనిత బుగ్గయ్య, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు, వైస్ చైర్మన్ మల్కాపురం లక్ష్మయ్య గౌడ్, మంద రమేష్, పెండ్లి మల్లారెడ్డి, ద్యావరా యాకయ్య, బిర్రు మధు, సురేందర్,రంగ అంజయ్య గౌడ్, హుసేన్ నాయక్, రాజు గౌడ్, మేకలగట్టు సర్పంచ్ సంధ్యాకిరణ్ గౌడ్, యువజన నాయకులు పాల్గొన్నారు.