Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డైరెక్టరు ఈ అండ్ ఎండీ సత్యనారాయణ
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు ఏరియా విద్యుత్ ఉత్పాదకతలో చరిత్ర సృష్టిస్తోందని సింగరేణి డైరెక్టరు ఈ అండ్ ఎండీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఏరియాలో మంగళవారం అధికారికంగా పర్యటించారు. అనంతరం .జీఎం జక్కం రమేష్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో పగిడేరులో నిర్మించతలపెట్టిన జియోథర్మల్ విద్యుత్ ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఓసీ 4 డంప్యాడ్పై 100 ఎకరాలలో తలపెట్టినన సోలార్ విద్యుత్ ప్లాంట్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జీఎం కార్యాలయంలో ఉన్నత అధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైనమిక్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు ఎన్.శ్రీధర్ ఐఏఎస్ మణుగూరు ఏరియా బొగ్గు ఉత్పత్తితో పాటు, విద్యుత్ ఉత్పాదకతలో తన ప్రత్యేకతను చాటుకునే విధంగా విద్యుత్ ఉత్పాదకత నిర్మాణాల పట్ల ఆమోదం తెలపడం ఎంతో శుభపరిణామం అన్నారు. ఇప్పటికే మణుగూరు ఏరియాలో రూ.125 కోట్లతో 30 మెగావాట్ల ద్వారా సంస్థకు ఏడాదికి రూ.11 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు డైరెక్టరు విథ్వనాధరాజు, జీఎం సేఫ్టి గురువయ్య, లలిత్‌కుమార్, వెంకటేశ్వర్లు, నర్సిరెడ్డి, అబ్దుల్ షబీరుద్దిన్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.