Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సింహులపేట
ములుగు జిల్లా వెంకటాపురంలో సూర్య షోటకాన్ కరాటే ఆకాడమి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రాష్టస్థ్రాయి వరల్డ్ పునకోసి, షోటాకాన్ కరాటే పోటీల్లో నర్సింహులపేట షోటాకాన్ కరాటే అకాడమీ కి చెందిన ఏడుగురు విద్యార్థులు కోడి సిరిచందన, కోడి వర్షిత్, మంచాల రోహిత్, గడ్డం యశ్వంత్ రాసాల అశ్వంత్, గంగాధరి సాయివర్థన్, నిమ్మల సిద్ధార్థన్ పలు పతకాలు సాధించారు. మంగళవారం వారిని ఎస్సై లావుడ్యా నరేష్ అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కరాటే కోచ్ బ్లాక్ బెల్ట్(నాల్గవ మాస్టర్) రాయపురం రాజ్‌కుమార్, ఏఎస్సై మహేందర్, తదితరులు పాల్గొన్నారు.