Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంసీ సమావేశం బహిష్కరించిన
పీిఏసీఎస్ డైరెక్టర్లు
నవతెలంగాణ-మల్హర్రావు
సభ్యుల తీర్మానం లేకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను దళారులకు ఎలా ఇస్తారో తెలపాలని పిఏసీఎస్ డైరెకర్లు ఇప్ప మొండయ్య, వొన్న తిరుపతి రావు, సంగ్గెం రమేష్, బొమ్మ రమేష్‌రెడ్డి, బానోతు సమ్మక్క.. చైర్మన్‌ను నిలదీశారు. ఎంసీ సమావేశాన్ని బహిష్కరించారు. మంగళవారం పీఏసీఎస్ చైర్మన్ చెప్యాల రామారావు అధ్యక్షతన సింగిల్ విండో డైరెక్టర్లతో ఎంసీ సమావేశం నిర్వహించారు. ఈ ఖరీఫ్ సీజన్లో పీిఏసీఎస్ ఆధ్వర్యంలో మండలంలో ఏర్పాటు చేస్తున్న, ఇటీవల ప్రారంభించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లపై చర్చ కొనసాగే క్రమంలో ప్రతిపక్ష డైరెక్టర్లు 5గురు మూకుమ్మడిగా నిరసన తెలిపి సమావేశం బహిష్కరిం చారు. అనంతరం విలేకరులతో ప్రతిపక్ష డైరెక్టర్లు మా ట్లాడారు. చైర్మన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, సభ్యు లకు తెలియకుండానే కల్లాలు కమిషన్లకు అమ్ముకుం టున్నాడని ఆరోపించారు. దీంతో దళారులు రైతుల ధాన్యం తూకంలో నట్టేట ముంచుతారని ఆవేదన వ్యక్తం చెశారు. భూపాలపల్లి డీసీఓ స్పందించి కల్లాలపై డైరెక్టర్ల పర్యవేక్షణ నిర్వహించకుంటే పోరాడతామని, డైరెక్టర్ పదవులకు రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.