Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో నర్సంపేట డిపో ఆధ్వర్యంలో ప్రయా ణికుల సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భం గా మండలంలోని పలు గ్రామాల ప్రజల నుంచి వినతు లను స్వీకరించారు. సమస్యల గురించి అడిగి తెలుసు కున్నారు. అనంతరం డీఎం మాట్లాడారు. ఆర్టీసీ ప్రయాణి కులకు బీమా సౌకర్యం ఉంటుందన్నారు. ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించాలని కోరారు. కరోనాతో ఆర్టీసీ నష్టాల్లోకి చేరిందన్నారు. అన్ని తరగతుల ప్రజలు ఆర్టీసీ, కార్గో సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్య క్రమంలో మాజీ సర్పంచ్ భూపతి తిరుపతి, ఉపసర్పంచ్ ఈసం నరేష్, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ సరస్వతి, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నరేందర్, డిపో క్లర్క్ భద్రయ్య, సిబ్బంది యూనుస్, తదితరులు పాల్గొన్నారు.