Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
రాష్ట్రంలో పంట పండించడంలోనే కాకుండా విక్రయిం చడంలోనూ రైతులకు తిప్పలు తప్పడం లేదని బీజేపీ అను బంధ గిరిజన మోర్చా రాష్ట్ర రీసెర్చ్ పాలనీ కన్వీనర్ భూక్యా రాజునాయక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ను రాజకీయ సమస్యగా చూపుతూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆయన మండిపడ్డారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో బీజేపీ మండల అధ్యక్షులు వాసం మునీందర్ అధ్యక్షతన గురు వారం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాజు హాజరై మాట్లాడారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులను రాష్ట్ర ప్రభుత్వం నట్టేట ముంచుతోందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని హితవు పలికారు. సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి భూపతి తిరుపతి, గిరిజన మోర్చా వనబంధు రాష్ట్ర కన్వీనర్ బోడ నవీన్నాయక్, మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి మురళీ, బీజేవైఎం జిల్లా కోశాధికారి ఈసం నరేష్, జిల్లా కార్యదర్శి వజ్జ రవి, గంగారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జనగాం వెంకన్న, శివరాం నాయక్, జిల్లా కార్యదర్శి ఈక నరేష్, నాయకులు సిరబోయిన యాకన్న, ఆలెం బాబు, వాసం కొమ్మాలు, వెంకన్న, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.