Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
రైతుల సమస్యల పట్ల పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీఐ జిల్లా కార్య దర్శి విజయసారథి అన్నారు. స్థానిక నల్లమల గిరిప్రసాద్ భవన్లో గురు వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించే పంటల ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వాలకు లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా సమస్యను పక్కదారి పట్టించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధర్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరితంగా వ్యవహరిండచం సరికాద న్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాస్, జిల్లా నాయకులు జంపాల వెంకన్న, రాగం రమేష్, పల్లా కోటి, భిక్షమయ్య, బీమ్లా, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.