Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
సభ్యత్వ నమోదులో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జీలు పూజారి సురేందర్బాబు, చౌలం వెంకటేశ్వర్లు కోరారు. మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు అధ్యక్షతన గురువారం నిర్వహించిన డిజిటల్ సభ్యత్వ నమోదు సమావేశానికి సురేందర్, వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మండలంలో ఐదు వేలకుపైగా సభ్యత్వాలు చేయించాలని సూచించారు. బూత్ కన్వీనర్లు సోషల్ మీడియా ఇన్ఛార్జీలకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. సభ్యత్వాలు పెంచడం ద్వారా పార్టీ బలోపేతానికి పాటుపడాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఖలీల్ ఖాన్, ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్, ప్రధాన కార్యదర్శి వావి లాల ఎల్లయ్య, జిల్లా నాయకుడు సులేమాన్, యూత్ అధ్యక్షుడు వసంత శ్రీనివాస్, నాయకులు ముక్కెర లాలయ్య, నర్సింహారావు, వార్డు సభ్యులు పడిదల హన్మంతు, చిక్కల్ల మానస, చామర్తి మనోజ్, ముస్తఫా, కొండాయి లక్ష్మీనారాయణ, తాళ్లపెల్లి నరేందర్ పాల్గొన్నారు.