Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ
నవతెలంగాణ-ధర్మసాగర్
మండలంలోని ముప్పారం గ్రామంలోని ముఖ్యనాధుని ఆలయ అభివద్ధికి కషి చేస్తానని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తెలిపారు. ఆలయాన్ని గురువారం ఆమె సందర్శించి మాట్లాడారు. ఆలయంలో అద్భుతమైన శిల్ప సంపదను, ప్రకతి అందాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయాన్ని పట్టించుకోకపోతే పూర్తిగా శిథిలావస్థకు చేరే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకతి అందాల నడుమ ఉన్న ముక్యనాథస్వామి త్రికూటాలయాన్ని అభివద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి స్థానిక మాజీ ఎమ్మెల్యే గుండె విజయరామారావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆలయ అభివృద్ధికి కషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు గురజాల వీరన్న, మండల అధ్యక్షుడు గంకిడి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ముక్కెర రవి, తాళ్లపెల్లి కుమార్, కందుకూరి విజరుచందర్, గుర్రాల శ్రీనివాస్, కోరుకొప్పుల అనిల్, మజ్జిగ లింగం, ముప్పారం గ్రామస్తులు ధారపు చంద్రయ్య, శివసాని ప్రవీణ్, వజ్ర రాజబాబు, పిట్టల చంద్రశేఖర్, శ్రావణ్, ల్యాగ జగదీష్, గడ్డం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు
మండలంలోని నారాయణగిరి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు గంగిడి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నారాయణగిరి గ్రామానికి ఆమె చేరుకొని ఆలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా మాహిళా మోర్చా అధ్యక్షురాలు కేతిరెడ్డి విజయలక్ష్మీ, జిల్లా కార్యదర్శి గురిజాల వీరయ్య, బొజ్జపెల్లి సుభాష్, జిల్లా యువజన నాయకుడు జక్కుల సుధీర్, మండల ఉపాధ్యక్షుడు దుస్సా రజిని బాబు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మజ్జిగ లింగం, కోరుకొప్పుల అనిల్, ముక్కెర రవి తదితరులు పాల్గొన్నారు.