Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అడిషనల్ కలెక్టర్ టీఎస్ దివాకర
నవతెలంగాణ-గణపురం
ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని. అడిషనల్ కలెక్టర్ టీఎస్ దివాకర హెచ్చరించారు. గురువారం మండలంలోని అప్పయ్యపల్లె గ్రామంలో దళితులు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ సిబ్బంది తో కూల్చి వేయించారు. బృహత్ పల్లె ప్రకృతి వనానికి ఈ భూమిని ఇవ్వాలని పేర్కొన్నారు. ఇంటి స్థలాలు ఇచ్చే అవకాశం లేదన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి దళితులందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ దళితులు వినకపోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి అప్పటి ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితం కేటాయించిందని భూమి రానురాను అన్యాక్రాంతమైందన్నారు. ఇందులో ఎకరం భూమిని పల్లె ప్రకృతి వనం కేటాయించి మిగతా భూమిని దళితులకు భూ పంపిణీ చేయాలని కలెక్టర్‌కు దళితులు విన్నవించుకున్నారు. ప్రస్తుతం పల్లె ప్రగతి పనులను అడ్డుకోవద్దని అడిషనల్ కలెక్టర్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు ససేమిరా వినకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. అనంతరం మళ్లీ వారు తాత్కాలిక గుడిసెలు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సతీష్‌కుమార్, ఆర్ఐ సాంబయ్య, సర్పంచ్ ఐలోని శశిరేఖ రామచంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.