Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
న్యాయం చేయాలంటూ ఓ మహిళ దీక్ష చేపట్టిన ఘటన మండలంలోని మీదికొండ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామానికి చెందిన దేశగాని వెంకన్న, కోమలత దంపతుల కూతురు మౌనిక, మండలంలోని మీదికొండ గ్రామానికి చెందిన వడ్లకొండ రామచంద్రు, అండాలు కుమారుడు శివతో నవంబర్ 2020న వివాహం జరిగింది. కట్న కానుకల పేరిట రూ.11లక్షలు మాట్లాడుకున్నారు. రూ.4లక్షల 50వేలు, బంగారం ఇచ్చారు. ప్రమాదవశాత్తు వడ్లకొండ శివ హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కాగా ఇరుపక్షాల పెద్దల సమక్షంలో రూ.9.50లక్షలు తిరిగి పరిహారం ఇచ్చేందుకు తీర్మానం చేసుకున్నారు. అయినప్పటికీ బాధితురాలికి నేటికీ ఇవ్వకపోవడంతో బాధితురాలి కుటుంబసభ్యులతో మౌనిక దీక్షకు దిగింది. తమకు న్యాయం చేసేంతవరకు దీక్ష విరమంచబోమని బాధితురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు.