Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని మల్లంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యా వాలంటీర్ ఎండీ జరీనా బేగంకు మహాత్మా హెల్పింగ్ హ్యాండ్ వ్యవస్థాపకులు గంట రవీందర్ చేయూతనిచ్చారు. గురువారం రూ.9వేల వేతనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గంటా రవీందర్ మాట్లాడుతూ.. మల్లంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రైవేట్ విద్యా వాలంటీర్ గా పని చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. విద్యా వాలంటీర్ల సేవలను విద్యార్థులు,ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గంట రవీందర్ చేస్తున్న కృషిని ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులు అభినందించారు.