Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు : ఈఓ, ఆలయ చైర్మెన్
నవతెలంగాణ-రేగొండ
మండల పరిధి బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర ప్రారంభమైంది. ఏటా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గురువారం తిరుమలగిరి గ్రామానికి చెందిన వంశీ అర్చకులు కుర్మాచలం వెంకటేశ్వర్లు ఇంటి నుండి ఉత్సవ విగ్రహాలను బుగులోని గుట్టపైకి చేర్చాడంతో జాతర ప్రారంభమైనట్లు ఆలయ ఈవో బిల్ల శ్రీనివాస్, ఆలయ చైర్మెన్ కడారి జనార్దన్ తెలిపారు. నేడు స్వామివారి కల్యాణం 20న ప్రత్యేక అభిషేకం, 21న మొక్కులు, 22న గుట్టపై నుండి తిరిగి అర్చకుల ఇంటికి ఉత్సవ విగ్రహాలు చేర్చడంతో జాతర ముగుస్తుందని తెలిపారు. జాతరకు వచ్చే సందర్శకుల సౌకర్యార్థం అన్ని ఎర్పాట్లను పూర్తిచేసినట్టు తెలిపారు. తాగునీటి వసతి, తాత్కాలిక స్నానాల ఘట్టాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాండవుల గుట్ట నుండి జాతరకు వచ్చే దారిలో గుంతలను మొరంతో పూడ్చినట్లు తెలిపారు. విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి గుట్ట పై నీటి వసతి ఏర్పాటు చేశామని తెలిపారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరకాల భూపాలపల్లి నుంచి ఆర్టీసీ బస్సుల సౌకర్యం కూడా ఉంటుందన్నారు. సందర్శకుల అధిక సంఖ్యలో తరలివచ్చి జాతరను విజయవంతం చేయాలని కోరారు.