Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ-మహాముత్తారం
జాయింట్ సర్వే చేసి పోడుసాగుదారులకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. గురువారం మహాముత్తారం మండలం కోణం పేట గ్రామంలో అధికారులు, రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మిక తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. మండల కేంద్రంలో 100శాతం కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ఆరా తీశారు. అనంతరం మండలంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్నభోజనంను, వంటగదిని పరిశీలించారు. అనంతరం పదోతరగతి విద్యార్థినీలకు పాఠాలు బోధించారు. ఒక్కో విద్యార్థిని ని ప్రశ్నలు అడుగుతూ ఆయా సబ్జెక్టు చెందిన టీచర్లను మందలించారు. చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉన్నారని, వచ్చే నెలలో వసానని అప్పటి వరకు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, వారానికి ఐదు రోజులు ఉడకబెట్టిన కోడుగుడ్లను అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం వర్కర్లకు త్వరలో బిల్లులు అందించేలా కృషి చేస్తామన్నారు. జెడ్పీటీసీ లింగ మల్ల శారద దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.