Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని మండలంలోని నమిలిగొండ గ్రామ ఎంపిటీసీ పురుమాని రజాక్ యాదవ్, కడియం యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్మకంటి నాగరాజు గురువారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కడియంకు సీఎం కేసీఆర్ మరోమారు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి, చిల్పూర్ మండలాల కడియం యువసేన అధ్యక్షులు శివ, ఇల్లందుల విజరు, నమిలిగొండ గ్రామ అధ్యక్షులు కోల హరిక్రిష్ణ, ఉప సర్పంచ్ వెలిశాల అశోక్, రంగు రాంబాబు, చింతల నరేష్, తదితరులు పాల్గొన్నారు.