Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్‌కు బాధిత రైతుల ఫిర్యాదు
నవతెలంగాణ-మహాదేవపూర్
మండల పరిధి బీరసాగర్ శివారులో మేడిగడ్డ బ్యారేజ్ ముంపునకు గురయ్యే భూముల జాబితాల్లో గోల్మాల్ జరిగిందని బీరసాగర్ గ్రామ పలువురు రైతులు ఆరోపించారు. గురువారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి వారు మాట్లాడారు. బీరసాగర్ గ్రామ శివారు సర్వే నెంబర్ 24,25,28లో మొత్తం 47 ఎకరాల భూమి ఖరాజ్ ఖాతా, ప్రభుత్వ భూమితో పాటు పోడు భూములను సైతం మహాదేవపూర్, కాటారం మండలానికి చెందిన కొందరు అక్రమా ర్కులు మేడిగడ్డ బ్యారేజ్ ముంపు జాబితాలో నమో దు చేసుకున్నారని అన్నారు. మహాదేవపూర్ మండ లంలోని కుదురుపల్లి గ్రామానికి చెందిన వారే అధికంగా ఉన్నారని ఆరోపించారు. ఈ భూమి మెడిగడ్డ బ్యారేజ్ ముంపులో పోవడంతో అధికా రులు కుమ్మకై లబ్ధి పొందాలని యత్నిస్తున్నట్టు ఆరోపించారు. అసలు పట్టా ఉన్న రైతుల భూము లను ముంపు జాబితాలో చేర్చకుండా ఎంజారు మెంట్ సర్వేకు తప్పుడు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. రీ సర్వే కు వచ్చిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ముంపు జాబితాలో ఉన్న అక్రమార్కుల పేర్లను తొలగించినట్టుచెప్పి తొలగించకుండా అదే తప్పుడు లిస్ట్‌ను ప్రభుత్వానికి అందజేశారని ఆరోపించారు. అక్రమార్కుల పేర్లపై భూమి ఉన్నదని నమ్మించేందుకు రెవెన్యూ ఉద్యోగులు పాత రెవెన్యూ రికార్డులైన పహణిలను తొలగిస్తూ వాటి స్థానాల్లో అక్రమార్కుల పేర్లు చేరుస్తున్నారన్నారు. మరి కొన్ని చోట్ల పాత అసలు పేర్లను చెరిపి నకిలీ పేర్లను నమోదుచేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి భూమినే నమ్ముకున్న నిజమైన తమకు న్యాయం చేయాలని కోరారు. రైతులు లక్ష్మణ్, పిట్టల శంకర్ పాల్గొన్నారు.