Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి మున్సిపాలిటీలో బకాయి పన్నులన్నింటిని వసూలు చేయా లని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్, సింగరేణి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి సంస్థ నుండి బకాయి పన్నులను వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీకి బకాయి పన్నులను చెల్లించాలని సింగరేణి జీఎం శ్రీనివాస రావును ఆదేశించారు. పట్టణంలో ఇంటి పన్నులతోపాటు అన్ని రకాల దుకా ణాలకు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి వాణిజ్య పన్నులను వంద శాతం వసూలు చేయాలన్నారు. నిరంతరం దాడులు చేపట్టి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని అన్నారు. మున్సిపాలిటీ పరిధి సీసీ, బీటీ రోడ్లు, స్మశానవాటికలు, డంపింగ్ యార్డ్, మార్కెట్ తదితర నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. వార్డులను స్వచ్ఛ వార్డులుగా తీర్చిదిద్ది ప్రకటించాలన్నారు. పట్టణంలో ఇంటింటికి మిషన్ భగీరథ నీరందించేందుకు చేపట్టిన పైప్ లైన్, వాటర్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అనంతరం ఆర్అండ్బి ఇంజనీరింగ్ అధికారులతో సమా వేశమయ్యారు. జిల్లాలో పీఎంజీఎస్‌వై, ఆర్డీఎఫ్, డీఎంఎఫ్టీ ప్లాన్, 2 బిహెచ్కె తదితర నిధులతో చేపట్టిన వంతెనలు, రోడ్లు, రహదారుల విస్తరణ, కలెక్టరేట్ భవన సముదాయ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆరఅండ్‌బి ఈఈ వెంకటేష్‌ను ఆదేశించారు. డీఈ రమేష్, ఏఈలు పాల్గొన్నారు.