Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
నవతెలంగాణ-జనగామ
జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ సీిహెచ్ శివలింగయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో అధికారులతో సమీక్షించి ఆయన మాట్లాడారు. వానాకాలం ధాన్యం కొనుగోలుకు జిల్లావ్యాప్తంగా 189 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస కొనుగోళ్ళు ప్రారంభించామన్నారు. దళారులు, వర్తకులు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మకుండా పటిష్ట పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వకొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మితే నేరుగా రైతుల ఖాతాల్లోకే డబ్బులు జమచేస్తామన్నారు. రైతు మొబైల్ నెంబర్ ఆధార్‌తో అనుసంధానానికి పోస్టల్‌శాఖ ద్వారా ఏర్పాట్లు చేశామన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.