Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ స్పీకర్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. సాయంత్రం రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు గవర్నర్ కోటాలో కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి పేరును ఖరారు చేసి కేబినెట్ రాష్ట్ర గవర్నర్ ఆమోదానికి పంపగా, 'పాడి'పై కేసులుండడంతో గవర్నర్ ఆ ఫైల్‌ను నిలిపేశారు. దీంతో ఆ స్థానంలో మధు సూదనాచారి పేరు ఖరారు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లిలో పోటీ చేసి ఓడిపోయిన నాటి నుండి 'సిరికొండ' పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. తాజా నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు 4 ఎమ్మెల్సీ పదవులు దక్కాయి.
మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం ప్రక టించడంతో ఆయన అనుచరుల్లో హర్షాతిరే కాలు వ్యక్తమౌతున్నాయి. గత శాసనసభ ఎన్ని కల్లో భూపాలపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి ఆయన సముచిత ప్రాధాన్యత కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నాటి నుండి సీఎం కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడిగా 'సిరికొండ' ఉన్నారు. ఉద్యమ కాలం నుంచి సన్నిహి తుడుగా 'సిరికొండ'కు తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్‌గా అవకాశం కల్పించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో 'సిరికొండ' గత మూడేండ్లుగా సరైన ప్రాధాన్యతను దక్కించుకోవడానికి ఇప్పటి వరకు వేచి చూడాల్సి వచ్చింది.
ఉమ్మడి వరంగల్‌కు నాలుగు ఎమ్మెల్సీలు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ పదవులు, గవర్నర్ కోటాలో ఒకటి మొత్తం నాలుగు ఎమ్మెల్సీ పదవులు దక్కడం టిఆర్ఎస్లో హర్షాతిరేకం వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యేల కోటాలో ఇప్పటికే మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్రావు, డాక్టర్ బండా ప్రకాశ్‌లు ఎంపికై నామినేషన్లను దాఖలు చేశారు. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. తాజాగా గవర్నర్ కోటాలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచాని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.