Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని మంగపేట, తిమ్మంపేట, బాలన్న గూడెం, వాడగూడెం, వాగొడ్డుగూడెం, తిమ్మాపూర్, దోమెడ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను డైరెక్టర్లతో ప్రారం భించినట్లు సొసైటీ చైర్మెన్ తోట రమేష్, సీఈఓ జగన్నాధ రావు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు దాన్యం తరలించి ప్రభుత్వ గిట్టుబాటు ధరను పొందాలని సూచిం చారు. 'ఏ' గ్రేడ్ ధాన్యానికి రూ.1960లు, సాధారణ రకానికి రూ.1940లు చొప్పున మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు సింగరబోయిన నర్సయ్య, అచ్చె సత్యనారాయణ, కొమరం బాబురావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ, నాయకులు చిల్కమర్రి లక్ష్మయ్య, నూనె లింగయ్య, యగ్గడి అర్జున్, సెంటర్ ఇన్ఛార్జీలు పొదెం రాంబాబు, కన్నా సంపత్, దబ్బకట్ల వసంత, మడి శోభన్, ఇర్ప రమేష్, రైతులు చిల్కమర్రి వేణు, మండవ రామకష్ణ, బర్పటి దిలీప్, సిబ్బంది పాల్గొన్నారు.